Srikaruda naa Yesayya Hosanna Ministries song Krupa Krupa

Lyrics in TeluguLyrics in English

కృప కృప…, సజీవులతో నను నిలిపినది నీ కృప.. //2//

నా శ్రమ దినమున,నాతో నిలిచి! 

నను ఓదార్చిన నవ్య కృపా .., నీదు కృప //2//

కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్య..

1. శాశ్వతమైన నీ ప్రేమతో – నను ప్రేమించిన శ్రీకరుడా..

నమ్మకమైన నీ సాక్షినై నీ దివ్య సన్నిధిలో నన్నోదిగిపోనీ.. //2//

నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మేనే //2//

నీ మహిమను ప్రకటింప నను నిలిపేనే //కృప//

2.గాలి తుఫానుల, అలజడిలో – గూడు చెదరిన గువ్వవలే

గమ్యమును చూపే,నిను వేడుకొనగా – నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి //2//

నీ వాత్సల్యమే నవ వసంతము – నా జీవిత దినముల ఆధ్యంతము //2//

ఒక క్షణమైనా విడువని,ప్రేమామృతము //కృప//

3. అత్యున్నతమైన కృపలతో – ఆత్మ ఫలముల సంపదతో

అతి శ్రేష్ఠమైన స్వాస్థమును పొంది – నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ//2//

నా హృదయార్పణ నిను మురిపించని – నీ గుణాతిశయములను కీర్తించనీ //2//

ఈ నిరీక్షణ నాలో,నేరవేరనీ //కృప//

Lyrics in English:

Krupa krupa sajeevulato nanu nilipinadi nee krupa //2//

Naa srama dinamuna naato nilachi !

Nanu odaarchina navyakrupa… needu krupa //2//

Krupaasaagara mahonnatamaina nee krupa chalunaya..

1. Sashwatamaina nee premato – nanu preminchina sreekaruda…

Nammakamaina nee saakshinai nee divya sannidhilo nannodigiponi //2//

Nee vupadeshame naalo phalabaritamai – nee kamaneeya kaantulanu virajimmene //2//

Nee mahimanu prakatimpa nanu nilipene //Krupa//

2. Gaali tuphaanula alajadilo – gudu chedarina guvvavale

Gamyamu choope ninu vedukonaga – Nee prema kougililo nannadarinchitivi //2//

Nee vaatsalyame nava vasantamu – Naa jeevita dinamula aadyantamu //2//

Oka kshanamaina viduvani premaamrutamu //Krupa//

3.Atyunnataminakrupalato – aatma phalamula sampadato

Atisreshtamaina swaasthyamunu pondi – Nee prema raajyamulo harshinchuvela //2//

Nee hrudayaarpana ninu muripinchani – Nee gunaatishayamulanu keerthinchani //2//

Ee nireekshana naalo neraverani.. //krupa//

Credits 
Produced by : Hosanna Ministries
Sung by: Pastor Ramesh
Music: Pranam Kamalakar
Song: Krupa Krupa

Watch this song on below YouTube link: