పల్లవి: సృష్టికర్త  యేసుని స్తుతించెదము సర్వసృష్టియు ప్రభు క్రియలే

సర్వ జనాలి సునాదముతో ప్రభుని క్రియలు ఘనపరచెదము 

హ… హ.. హ… హ.. హల్లెలూయా… || 3 times || హల్లెలూ… యా పాడెదము

1. అగాధజలములపై ఆత్మ అలల ఊయల ఊగిన వేల

చీకటిని విడదీసి శూన్యమును వెలిగించి

నీదు మహిమను చూపితివే|| సృష్టి ||

2.  అంతరిక్షమున జ్యోతులను అభినవ లోకము విరసిన వేళ

ప్రాణులను సృజియించి ప్రకృతిని యింపుగను

రూపించిన నిను పొగడెదను || సృష్టి ||

3. భూఆవిరిని రప్పించి ఆరిన నేలను తడిపిన వేళ

మంటి నుండి మము చేసి నాసికలో జీవమూది

మనిషికి రూపము నిచ్చితివే|| సృష్టి ||