|| పల్లవి ||  స్తుతికి  పాత్రుడా  దేవా -సుతుడ మా ప్రభూ

హిత దయాళుడా రాజా-నుతి నర్పింతుము  

క్షితిలో మమ్ము బ్రోచితి -ప్రీతి తోడ వాత్సల్యం చూపితివి

నిత్యము నీదు ప్రేమకై -సత్యముతో స్తోత్రింతుము

1. ఇన్నాళ్లు పోషించితివి -ఉన్నానని నీవంటివి దేవా

నిండార దీవించితివి -మెండైన నీ దయతో

||అను పల్లవి || సమృద్ధి నీవేగా -సర్వాధి కారివి

సజీవుడా మా దేవా -మా దీన స్తుతులందుకో  ||స్తుతికి ||

2. మా మొరల  నాలించితివి-మా కరముల బలపరచితి వీవు

 వరములతో మము నింపితివి -వర దాత మా ప్రభూ|| అను పల్లవి ||

3. మా లేమిలో సంపద నీవె -నిస్పృహలో నీరిక్షణ నీవె

బాధలలో నెమ్మది నీవె -మా గాధల అంతం నీవె || అను పల్లవి ||