స్తుతియు మహిమ ఘనతా నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా 1. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభ దినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని 2. నీవొక్కడవే గోప్పదేవుడవు ఘనకార్యములు జేయుదువు నీదు కృపయే నిరంతరము నిలిచి యుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము 3. నూతనముగ దినదినము నిలచు నీదు వాత్సల్యత మాపై ఖ్యాతిగా నిలచె నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మాస్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా 4. భరియించితివి శ్రమలు నిందలు ఒర్చితివన్ని మాకొరకు మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ పరమునుండి మాకై వచ్చే ప్రభుయేసు జయము