ఉన్నతమైన నీ కృప – ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా //2// ఎంతటిదానను నీ దయ పొందుటకు నీ పాదములను చేరి ఆరాధించుటకు
నేనెంతటిదానను నీ దయ పొందుటకు నీ పాదములను చేరి ఆరాధించుటకు
నను మరువలేదు నీ ప్రేమ మారలేదు నీ కరుణ మరువలేదు నీ ప్రేమ మారలేదు నీ కరుణ
1.కరుణాసంపన్నుడా వాత్సల్యపూర్ణుడా సదా నిలుచును నీ కృప //2// దీర్ఘాయువుతో మేలులు చూపి నను దీవించావు //2// నా కోట నీవే నా కేడెము నీవే //2//
2.లోకం మరచిపోతున్నా స్నేహం విడచివెళుతున్నా నా చేరువైనది నీవేనయ్యా //2// నిను విడువను ఎన్నడూ ఎడబాయనన్నావు… //2// ఏ స్థితిలోనైనా.. నాతో ఉంటావు //2//
3.నీ వాక్యమే దేవా నా పాదములకు దీపమాయెను అనుదినము //2// ఆత్మీయులతో అనుబంధం నిత్యము సంతోషమే //2// ఆరాధించెద నా జీవిత కాలము //2//