Vaakyame sariradhariyei ||పల్లవి || వాక్యమే శరీరధారియై వసించెను జీవమై శరీరులను వెలిగింపను …ఆ ..ఆ..ఆ.. 1. కృపయు సత్యములు -హల్లెలూయ నీతి నిమ్మళము – హల్లెలూయ (2) కలసి మెలసి -భువిలో దివిలో (2) ఇలలో సత్యము మొలకై నిలిచెను||వాక్యమే || 2.ఆశ్చర్యకరుడు – హల్లెలూయ ఆలోచనకర్త – హల్లెలూయ నిత్యుడైన -తండ్రి దేవుడు నీతిసూర్యుడు -భువినుదయుంచెను||వాక్యమే || 3. పరమ దేవుండే-హల్లెలూయ నరులలో నరుడై -హల్లెలూయ కరము చాచి -కనికరించి మరు జన్మములో -మనుజుల మలచే ||వాక్యమే ||