వధియింపబడిన గొర్రెపిల్ల – సింహాసనాసీనుడ.. /2/ నీ రక్తమిచ్చి ప్రాణమిచ్చి – మమ్ములను కొన్నావే ప్రతి జనములో నీ ప్రజలను – నీ యాజక రాజ్యము చేసావే రక్షణ -జ్ఞానము -స్తోత్రము -శక్తియు ఐశ్వర్యము నీదే.. హే.. రాజ్యము -బలము -ప్రభావము – మహిమ ఘనత నీదే .. అర్హుడా యోగ్యుడా – క్రుతజ్ఞతకు పాత్రుడా.. /2/వధి(2)/ 1. అన్నిటికి పైనున్నావు – అందరిని చూస్తున్నావు అధికారము ఇచ్చే మహా దేవుడవు ఆకాశ భూములయందు – ఈసృష్టి సర్వమునందు నీ చిత్తము జరిగించే మహారాజు నువు నీ రాజ్యము నిలుచును నిరతము – నీదేగా సర్వాధికారము నీవెవ్వరికి ఇత్తువో వారిదే అవును భూరాజ్యము .. మహోన్నతుడు యేసుని శుద్ధులదె ఈఅధికారము.. {రక్షణ -జ్ఞానము -స్తోత్రము -శక్తియు ఐశ్వర్యము నీదే.. హే.. రాజ్యము -బలము -ప్రభావము – మహిమ ఘనత నీదే .. అర్హుడా యోగ్యుడా – క్రుతజ్ఞతకు పాత్రుడా.. /2/వధి(2)/} 2. దృశ్యములు అదృశ్యములు – ఆకాశ భూజలజీవులు అన్నియును నీయందే సృజియింపబడెన్ సింహాసన ప్రభుత్వములు – ప్రధానులు అధికారమును అందరును నీశాసనమునకు లోబడును నీమాటతో ఎలేడి ప్రభుడవు – నీవొకడివే సృష్టికి కర్తవు పరలోక పెద్దలందరు తమ కిరీటముల్ తీసి నిన్ను కొలుతురే .. భూరాజులు నివాసులు తమ మహిమనంత తెచ్చి నిన్ను పూజింతురే … {రక్షణ -జ్ఞానము -స్తోత్రము -శక్తియు ఐశ్వర్యము నీదే.. హే.. రాజ్యము -బలము -ప్రభావము – మహిమ ఘనత నీదే .. అర్హుడా యోగ్యుడా – క్రుతజ్ఞతకు పాత్రుడా.. /2/వధి(2)/} 3. దావీదు చిగురువు నువ్వు యుదా స్తుతి సింహము నువ్వు దావీదు తాళపుచెవి యజమానుడవు నువ్ తలుపులు మూసావంటే -తెరిచేటి వారేలేరు నువ్ తెరిచిన తలుపులు మూసే వారెవరు.. నీ భుజములపై రాజ్య భారము – నీదేగా నిత్య సింహాసనము భూ రాజ్యములన్నింటిని కూలగొట్టి నిలుచును నీ రాజ్యము… నిను విశ్వసించు వారికే చెల్లుతుంది – నీ సత్య రాజ్యము … {రక్షణ -జ్ఞానము -స్తోత్రము -శక్తియు ఐశ్వర్యము నీదే.. హే.. రాజ్యము -బలము -ప్రభావము – మహిమ ఘనత నీదే .. అర్హుడా యోగ్యుడా – క్రుతజ్ఞతకు పాత్రుడా.. /2/వధి(2)/} 4. సేరాపులు కేరుబులచే పరిశుద్ధుడు పరిశుద్ధుడని తరతరములు కొనియాడబడే శుద్దుడవు.. నీ స్తుతిని ప్రచురము చేయ – మమ్మును నిర్మించావయ్యా మా ఆరాధనకు నీవే యోగ్యుడవు నీ నామము బహుపూజనీయము – ప్రతి నామమునకు పై నామము ప్రతివాని మోకాలును ప్రభుయేసు నామమందున వంగును … ప్రతినాలుక యేసుడే – అద్వితీయ ప్రభువని ఒప్పును… {రక్షణ -జ్ఞానము -స్తోత్రము -శక్తియు ఐశ్వర్యము నీదే.. హే.. రాజ్యము -బలము -ప్రభావము – మహిమ ఘనత నీదే .. అర్హుడా యోగ్యుడా – క్రుతజ్ఞతకు పాత్రుడా.. /2/వధి(2)/}