Vandanambonarthumo prabho Song lyrics వందనబోనర్తుమో ప్రభో ప్రభో – వందనబోనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్హాత్ముడా – వందనంబు లందుకోప్రభో 1. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు- గన్న తండ్రి మించి యెపుడు గాచియు ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రములివిగో 2. ప్రాత వత్సరంబు బాప మంతయు – బ్రీతిని మన్నించి మమ్ము గావుము నూత నాబ్ధమునకు నీదు నీతి నొసగు మా దాత క్రీస్తు నాద రక్షకా 3. దేవ మాదు కాలు సెతులెల్లను – సేవకాళి తనువూ దినము లన్నియు నీవొసంగు వెండి పసిడి జ్ఞానమంతయు నీ సేవకై యంగీకరించుమా 4. కోత కొరకు దాస జనము నంపుము – ఈ తరి మా లోటు పాట్లు దీర్చుము పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము – ఖ్యాతి నొందు నీతి సూర్యుడా 5. మా సభలను పెద్ద జేసి పెంచుము – నీ సువార్త జెప్ప శక్తి నీయుము మోసపుచ్చు నంధకారమంత ద్రోయుము యేసు కృపన్ గుమ్మరించుము Lyrics in English: Vandanambonartumo prabho prabho Vandanambonartumo prabho prabho Vandanambu tandri tanaya shudhhatmuda Vandanambu landuko prabho //2// 1. Inni naallu dharanu mammu gaachiyu – Kanna tandri minchi yepudu gaachiyu Ennaleni deevenalidu nanna Yesuva – Yanni retlu stotramulivigo //2// 2. Paata vatsarambu paapamantayu – Breetini manninchi mammu gaavumu Nootanaabdamunaku needu neetinosaguma – Daata Kreesthu naadha rakshaka //2// 3. Deva maadu kaalusetulellanu – Sevakaali tanuvu dinamulanniyu Neevosangu vendi pasidi jnaanamantayu – Nee sevakai yangeekarinchumu //2// 4. Kotakoraku daasajanamu nampumu – Eetari maa lotupaatlu deerchumu Paatakambulella maapi bheeti baapumu – Khyaatinondu neeti suryuda //2// 5. Maa sabhalanu peddachesi penchumu – Nee suvaartha cheppa shakthi neeyumu Mosapuchhu nandhakaaramanta droyumu – Yesu krupamma kummarinchumu //2// Go to top New Year songs Index U-Z Home