వెండి బంగారము ఉన్నాలేకున్నా… నీ చల్లని నీడ ఉంటే నాకు చాలును యేసన్నా నీ సన్నిధి నాకు తోడుగ ఉంటే చాలును యేసన్నా ||వెండి|| 1. ఎటు చూసినా వేదన – ఎటు చూసినా శొదనా 2 నీ పేటూ బీటలలో – నీ గాయపు చేతులలో 2 నీ అండ నాకు ఉంటే చాలు – దిగులే లేదన్నా2 ||వెండి|| 2. నా వారు ఎదిరించినా -నను చుట్టి భయపెట్టినా2 నీ ఉన్నత నామంలో – నీ కల్వరి రక్తంలో2 ఏ చీకటి శక్తుల గుంపుకైనా – చి౦తే లేదన్నా2||వెండి|| 3. శ్రమయిన బాధైనాను – హింసైనా కరువైనను2 నా శోధన వేళల్లో – నీ తోడు చాలన్నా2 నీ తోడు నీడ జాడలలో – ఏ కొదువె లేదన్నా2||వెండి|| 4. నా తల్లి నను మరచినా – నా వారు నను విడచినా2 నాలో నీవున్నా – నీ దాపు నాకున్నా 2 ఏ దూరమైన భారమైన – భయమే లేదన్నా2||వెండి||