విమోచకుడు మన యేసు ప్రభువు – అవతరించిన శుభ దినమే 

సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2X)

పల్లవి: ఆనందమే ఈ దినం – ఆశ్చర్యమే అనుక్షణం

ఆత్మీయమే ఆనుభవం – ఆనంద మానందమే (2X)

1. ఆకాశ తారలు కాంతి విరియగా – ప్రకృతి రవళిoచే ఈ జగాన (2X)

ముదమార గాంచిరి గొల్లలూ  జ్ఞానులూ||ఆనందమే||

2. నాడు పండుగ నేడు కనిపించే – లోకమా సిద్ద పడుమా (2X)

ప్రభు యేసు చెంతకు పరలోక విందుకూ ||ఆనందమే||

విమోచకుడు మన యేసు ప్రభువు – అవతరించిన శుభ దినమే 

సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2X)

ఆనందమే ఈ దినం – ఆశ్చర్యమే అనుక్షణం

ఆత్మీయమే ఆనుభవం – ఆనంద మానందమే (2X)