Vivaahamannadi song Chords

వివాహమన్నది – పవిత్రమైనది – ఘనుడైన దేవుడు ఏర్పరచినది /2/
1. దేహములో సగ భాగముగా – మనుగడలో సహచారిణిగా /2/
నారిగా సహకారిగ – స్త్రీని నిర్మించినాడు దేవుడు /2/వివా/
2.  ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని /2/
శిరసుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు/2/వివా/
3.దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధిపొందగా/2/
వేరుగా ఉన్నవారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు /2/వివా/