Vivaahamannadi song lyrics వివాహమన్నది – పవిత్రమైనది – ఘనుడైన దేవుడు ఏర్పరచినది /2/ 1. దేహములో సగ భాగముగా – మనుగడలో సహచారిణిగా /2/ నారిగా సహకారిగ – స్త్రీని నిర్మించినాడు దేవుడు /2/వివా/ 2. ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని /2/ శిరసుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు/2/వివా/ 3.దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధిపొందగా/2/ వేరుగా ఉన్నవారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు /2/వివా/