ఏ పాప మెరుగని యోపావన మూర్తి – పాప విమోచకుండ = నా పాలి దైవమా – నా పాపముల కొర – కీ పాట్లు నొందినావా 1. ముళ్ళతో గేరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా = ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా 2. కలువరి గిరిదనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా = శిలువ నీతో మోయ – తులువలు వేరొకని – దోడుగా నిచ్చినారా 3. చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా = కడకు కల్వరిగిరి – కడకేగి సిల్వను – గ్రక్కున దించినావ 4. ఆ కాల కర్ములు – భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా = నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది మేకులతొ గ్రుచ్చినారా 5. పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా = సిలువపై బలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా 6. బల్లిదుండగు బంటు – బల్లెమున నీప్రక్క – జిల్లి బడ బొడచినాడా = ఉల్లోలములవలె నల్లనీరుబుకంగ – జల్లారెగద కోపము 7. కటకటా పాప సం – కటము బాపుట కింత – పటుబాధ నొందినావా = ఎటువంటి దీ ప్రేమ – ఎటువంటి దీ శాంత – మెటుల వర్ణింతు స్వామి