యెహొవ నా కాపరి – నాకు లేమి లేదు పచ్చిక గల చోట్ల – మచ్చికతో నడుపున్ 1. మరణపు చీకటిలో – తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను – కరుణతో ఆదరించున్ 2. పగవారి ఎదుట – ప్రేమతో నొకవిందు ప్రభు సిద్ధము చేయున్ – పరవశమొ౦దెదను 3. నూనెతో నా తలను – అభిషేకము చేయున్ నా హృదయము నిండి – పోర్లుచున్నది 4. చిరకాలము నేను – ప్రభు మందిరములో వసియీంచెద నిరాత౦ – సంతస మొందెదను