యెహోవ నా కాపరి – యేసయ్య నా ఊపిరి – నాకు లేమి లేదు లోయలలో, లోతులలో – యెహోవ నాకాపరి సంద్రములో, సమరములో – యేసయ్య నా ఊపిరి /యెహోవ/ 1. పచ్చిక గలచోట్ల నన్ను పరుండజేయును /2/ శాంతి కరమగు జలముల కడకు – నన్ను నడిపించును /2/లోయ/ 2. గాడాంధకారపు లోయలలో – సంచరించినను /2/ అపాయమేమి కలుగదు నాకు – నీవు తోడుండగా /2/లోయ/ 3. తన నాముబట్టి నన్ను – నీతి మార్గములో /2/ త్రోవ చూపి నడిపించును – సేద తీర్చును /2/లోయ/ 4. చిరకాలము నేను – యెహోవ సన్నిధిలో /2/ నివాసముండెదను నేను – నిత్యము సేవింతును /2/లోయ/