Yehovaa naa balamaa song lyrics
Click here for this song Chords
Lyrics in TeluguLyrics in English
యెహొవ నా బలమా – యధార్థమైనది నీ మార్గం
పరి పూర్ణమైనది నీ మార్గం #యెహొవ#
1. నా శత్రువులు నను చుట్టినను – నరకపు పాశములరికట్టినను //2//
వరదవలె భక్తి హీనులు పొర్లిన విడువక నను యెడబాయని దేవా//యెహొవ//
2. మరణపు టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై //2//
తన ఆలయములో నా మొర వినెను- అదరెను ధరణి భయ కంపముచే //యెహొవ//
3.నా దీపమును వెలిగించువాడు – నా చీకటిని వెలుగుగ జేయన్ /2//
జలరాశుల నుండి బలమైన చేతితో – వెలుపల చేర్చిన బలమైన దేవా//యెహొవ//
4.పౌరుషము గల ప్రభు కోపింపగ – పర్వతముల పునాదులు వణకెను
తననోటనుండి వచ్చిన అగ్ని – దహించివేసెను వైరుల నెల్లను //యెహోవా//
5.మేఘములపై ఆయనవచ్చును – మేఘములను తన మాటుగ జేయును //2//
ఉరుముల మెరుపుల మెండుగ జేసి అపజయమిచ్చును అపవాదికిని //యెహోవా//
6.దయగలవారిపై దయచూపించును – కఠినులయెడల వికటము జూపును //2//
గర్విష్ఠులయొక్క గర్వమునణచును – సర్వమునెరిగిన సర్వాధికారి //యెహోవా//
7.నా కాళ్ళను లేడి కాళ్ళగ జేయును – ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి
రక్షణ కేడెము నాకందించి – అక్షయముగ తన పక్షము జేర్చిన //యెహోవా//
8. యెహొవా జీవము గల దేవా – బహుగా స్తుతులకు అర్హుడ నీవు //2//
అన్యజనులలో ధన్యత చూపుచు -హల్లేలుయ స్తుతి గానము చేసేద //యెహొవ//
Yehova na balama – Yadhardhamainadi nee maargam
Paripoornamainadi nee maargam //yeahova//
1.Na satruvulu nanu chuttinanu – Narakapu paashamularikattinanu //2//
Varadavale bakthiheenulu porlina – viduvaka nanu yedabaayani deva //Yehova//
2.Maranaputurulalo maruvaka moralida – Vunnatadurgamai rakshana srungamai //2//
Tana aalayamulo naamora vinenu – Adarenu dharani bhayakampamuche //Yehova//
3.Na deepamunu veliginchu vaadu – Na cheekatini velugugajeyun //2//
Jalarasulanundi balamaina chetito – velupala cherchina balamaina deva //Yehova//
4.Pourushamugala prabhu kopimpaga – Parvatamula punaadulu vanikenu
Tananotanundi vachhina yagni – Dahinchivesenu vairulanellan //yehova//
5.Meghamulapai aayana vachhunu – Meghamulanu tana maatuga jeyunu //2//
Vurumula merupula mendugajesi – Apajayamichhenu apavaadikini //Yehova//
6.Dayagala vaaripai dayachupinchunu – Kathinulayedala vikatamujupunu //2//
Garvistulayokka garvamu nanachunu – Sarvamunerigina sarvadhikaari //Yehova//
7.Na kaallanu ledi kaallagajeyunu – Yettaina sthalamulo sakthito nilipi //2//
Rakshanakedemu naakandinchi – Akshayamuga tana pakshamu jerchina //Yehova//
8.Yehova jeevamugala deva – bahuga stutulaku arhudaneevu //2//
Anyajanulalo dhanyata choopuchu – halleluya stuti gaanamu cheseda //Yehova//