యెహోవా నాకు వెలుగయ్యె – యెహోవా నాకు రక్షణయ్యె#2#

నా ప్రాణ దుర్గమయ్యె – నేను యెవరికి ఎన్నడు భయపడను#2#

1. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను#2# 

ఆపత్కాలములో చేయి విడువకను – యెహోవా నన్ను చేరదీయును#2# యెహోవా# 

2. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే#2# 

నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో -స్తుతి గానము చేసెదను#2# యెహోవా#

3. నాకు మార్గమును -ఉపదేశమును -ఆలోచన అనుగ్రహించే#2#

నీ అజ్ఞలలొ జీవించుటకు – కృపతో నింపి కాపాడుము #2# యెహోవా#