Yenta krupaamayudavu yesayya song Lyrics ఎంత కృపామయుడవు యేసయ్యా – ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా /2/ నలిగితివి వేసారితీవి – నలిగితివి వేసారితీవి /2/ నాకై ప్రాణము నిచ్చితివి – నాకై ప్రాణము నిచ్చితివి /2/ 1. బండ లాంటిది నాదు మొండి హృదయం- ఎండిపోయిన నాదు పాప జీవితం /2/ మార్చితివి నీ స్వాస్త్యముగ /2/ – ఇచ్చినావు మెత్తనైనా కొత్తహృదయం /2/ఎంత/ 2.వ్యాధి బాధలందు నేను క్రుంగీయుండగా – ఆదరించెను నీ వాక్యము నన్ను /2/ స్వస్ఠపరచెను నీ హస్తము నన్ను/2/ ప్రేమతో పిలచిన నాధుడవు /2/ 3.కన్న తల్లి తండ్రులు నన్ను విడచినను – ఈ లోకము నను వెలివేసిన /2/ మరువలేదు నన్ను విడువలేదు /2/ – ప్రేమతో పిలచిన నాధుడవు /2/ ఎంత/ 4.ఆదరణ లేని నన్ను ప్రేమించితివి- అభిషేకించితివి ఆత్మలోను /2/ నిలచుటకు ఫలించుటకు /2/ – అత్మతో నను ముద్రించితివి /2/ ఎంత/