ఎంత కృపామయుడవు యేసయ్యా – ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా /2/ నలిగితివి వేసారితీవి /2/- నాకై ప్రాణము నిచ్చితివి /2/ 1. బండ లాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయిన నాదు పాప జీవితం /2/ మార్చితివి నీ స్వాస్త్యముగ /2/ – ఇచ్చినావు మెత్తనైనా కొత్త హృదయం /2/ ఎంత/ 2. వ్యాధి బాధలందు నేను క్రుంగీయుండగా ఆదరించెను నీ వాక్యము నన్ను /2/ స్వస్ఠపరచెను నీ హస్తము నన్ను/2/ ప్రేమతో పిలచిన నాధుడవు /2/ ౩. కన్న తల్లి తండ్రులు నన్ను విడచినను – ఈ లోకము నను వెలివేసిన /2/ మరువలేదు నన్ను విడువలేదు /2/ – ప్రేమతో పిలచిన నాధుడవు /2/ ఎంత/