Yento vinta yento china  Song Lyrics (Siluva dhyanamulu)

ఎంతో వింత ఎంతో చింత – యేసు నాధు మరణ మంత = పంతముతో జేసి రంత – సోంత ప్రజలు స్వామి నంత /ఎంతో/

  1. పట్టి కట్టి నెట్టి కొట్టి – తిట్టి రేసు నాధు నకటా = అట్టి శ్రమల నొంది పలుక -డాయె యేసు స్వామి నాడు ॥ఎంతో॥

  2. మొయ్యలేని మ్రాను నొకటి – మోపి రేసు వీపు పైని = మొయ్యలేక మ్రానితోడ – మూర్చబోయె నేసు తండ్రి ॥ఎంతో॥

  3. కొయ్యపై నేసయ్యన్ బెట్టి – కాలుసేతులలో జీలల్ = కఠిను లంత గూడి కొట్టిరి – ఘోరముగ క్రీస్తేసున్ బట్టి ॥ఎంతో॥

  4. దాహముగొన జేదు చిరక – ద్రావ నిడిరి ద్రోహులకటా = ధాత్రి ప్రజల బాధ కోర్చి – ధన్యుడా దివి కేగె నహహా ॥ఎంతో॥

  5. బల్లెముతో బ్రక్కన్ బోడవన్ – పారె నీరు రక్త మహహా = ఏరై పారె యేసు రక్త – మెల్ల ప్రజల కెలమి నొసగు ॥ఎంతో॥

Lyrics: (Author Unknown)

From: Andhra Kraistava Keerthanalu Song number 191

Kindly excuse us if there are any grammatical mistakes as this is in old telugu style some of the original expressions may not possible to include using this code