Yesayya ne prema na sontamu song lyrics యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతము //2// యేసయ్య నీవేగ తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము – నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము – నాలోన నిత్యము ఒక సంబరం //యేసయ్య// 1. ఏపాటి నన్ను ప్రేమించినావు – నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు – నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నను కాచినావు – నీ కనికరమే చూపించినావు నా హృదిలోనే నీ వాక్యధ్యానం – నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి – నీ దయలో నే జీవించి నిన్నే నే పూజించి – నీలోనే తరియించీ యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతము యేసయ్య నీవేగ తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము 2. ఏనాడు నన్ను విడనాడలేదు – నీ నీడలోనే నడిపించినావు లోకాలనేలే రారాజు నీవే – నా జీవనావకు రహదారి నీవే నా గురి నీవే నా యేసుదేవా – చేరితి నిన్నే నా ప్రాణనాథా పర్వత శిఖరం నీ మహిమ ద్వారం – ఉన్నతమైనది నీ దివ్య చరితం సాటే లేరు నీకు – సర్వాథికారివి నీవు మారని దైవం నీవు – మహిమోన్నతుడవు నీవు//యేసయ్య// Lyrics in English: Yesayya nee prema na sontamu – Nalona palikina stutigeetamu //2// Yesayya neevega tolikiranamu – Naalona veligina ravikiranamu Yenaadu aarani na deepamu – Naa jeevitaaniki aadhaaramu Emmanuyeluga nee snehamu – Naalona nityamu oka sambaram //Yesayya// 1. Yepaati nannu preminchinaavu – Nee premalone nanu daachinaavu Na bhaaramanta nuvu mosinaavu – nannentagaano hechhinchinaavu Nee krupalone nanu kaachinaavu – Nee kanikarame choopinchinaavu Naa hrudilone nee vaakyadhyaanam – Na madilone nee naamasmaranam Ninne araadhinchi – nee dayalone jeevinchi ninne ne poojinchi – neelone tariyinchi.. Yesayya nee prema na sontamu – Nalona palikina stutigeetamu Yesayya neevega tolikiranamu – Naalona veligina ravikiranamu 2. Yenaadu nannu vidanaadaledu – Nee needalone nadipinchinavu Lokaalanele raaraajuneeve – Na jeevanaavaku rahadaari neeve Na gurineeve na Yesu deva – Cheriti ninne naa praana naadha Parvatasikharam nee mahima dwaaram – Vunnatamainadi nee divya charitam Sate leru neeku – Sarvaadhikaarivi neevu Maarani daivam neevu – Mahimonnatudavu neevu… //Yesayya// Credits : Lyrics & Producer : Joshua Shaik Music : Pranam Kamlakhar Vocals : Javed Ali Click below to watch this song on YouTube: Go to top