యేసే నా పరిహరి – ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్ల – ప్రియ ప్రభువే నా పరిహారి //2// 1. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను క్రుంగించె బాధలెన్నో //2// ఎన్ని నష్టాలు వాటిల్లినా – ప్రియ ప్రభువే నా పరిహారి //2//యేసే// 2. నన్ను సాతాను వెంబడించినా – నను శత్రువు ఎదిరించినా //2// పలు నిందలు నను చుట్టినా – ప్రియ ప్రభువే నా పరిహారి //2//యేసే// 3. మణి మాన్యాలు లేకున్నా – మనో వేదనలు వేదించినా //2// నరులెల్లరు నను విడచినా – ప్రియ ప్రభువే నా పరిహారి //2//యేసే// 4. బహు వ్యాధులు నను సోకినా – నాకు శాంతి కరువైనా //2// నను శోధకుడు శోధించినా -ప్రియ ప్రభువే నా పరిహారి //2//యేసే// 5. దేవా నీవె నా ఆధారం – నీ ప్రేమకు సాటెవ్వరు //2// నా జీవితకాలమంతా – నిను పాడి స్తుతించెదను //2//యేసే//