Yesu Kreestu puttenu nedu యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో మిలమిల మెరిసే అందాల తార వెలసెను గగనములో /2/ ఇది పండుగ క్రిస్మస్ పండుగ – జగతిలో నిండుగ వెలుగులు నిండగ /యేసు/ 1.పాపరహితునిగా శుద్హాత్మ దేవునిగా /2/ కన్య మరియకు వరసుతునిగా – (ఈ) జగమునకరుదెంచెను /2/ఇది/ 2.సత్యస్వరూపునిగా – బలమైనదేవునిగా /2/ నిత్యుడైన తండ్రిగా (ఈ) అవనికి ఏతెంచెను /2/ఇది/ 3.శరీరధారిగా – కృపగల దేవునిగా /2/ పాపులపాలిట పెన్నిధిగా -(ఈ) లోకమునకు వచ్చెను /2/ఇది/