Yevarikosamo Ee pranatyagamu telugu worship song lyrics

ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము – ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము

నీ కోసమే నా కోసమే

కలువరి పయనం – ఈ కలువరి పయనం /2 /ఎవరి/

1.ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా

ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా /2/

మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో

నడువలేని నడకలతో తడబడుతూ పోయావా

సోలి వాలి పోయావా…. /ఎవరి/

2.జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము

జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము /2/

మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా

నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి

తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు – వీరిని క్షమించు..వీరిని క్షమించు..

అని వేడుకొన్నావా… పరమ తండ్రిని /ఎవరి/

Credentials: 

Sung by : Dr.S.P.Balasubrahmanyam