పల్లవి: ఉన్నతమైన స్థలములలో – ఉన్నతుడా మా దేవా ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా/ఉన్నత/ 1. చెదరి పోయినది మా దర్శనము – మందగించినది ఆత్మలభారం మరచిపోతిమి నీ తొలిపిలుపు – నీ స్వరముతో మము మేలుకొలుపు నీ ముఖకాంతిని ప్రసరింపచేసి – నూతన దర్శన మీయుము దేవా నీ సన్నిధిలో సాగిలపడగా – ఆత్మతో మము నిలుపుము /ఉన్నత/ 2. పరిశోధించుము మా హృదయములను – తెలిసికొనుము మా తలంపులను ఆయాసకరమైన మార్గము మాలో – వున్నదేమో పరికించు చూడు జీవపు ఊటలు మాలోన నింపి – సేదదీర్చి బ్రతికించు మమ్ము మా అడుగులను నీ బండపైన – స్థిరపరచి బలపరచుము /ఉన్నత/ 3. మా జీవితములు నీ సన్నిధిలో – పానార్పణముగా ప్రోక్షించెదము సజీవయాగ శరీరములతో – రూపాంతర నూతన మనసులతో నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము – నీ కృపచేత బలపడియెదము లోకమున నీ వార్తను మేము – భారము తోడ ప్రకటించెదము/ఉన్నత/