యేసుతో ఠీవిగాను పోదమా! అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోదము #2# 1. రారాజు సైన్యమందు చేరను – ఆ రాజు దివ్య సేవ చేయను #2# యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా #2#- యేసుతో ఠీవిగాను వెడలను # యేసుతో# 2. విశ్వాస కవచమును ధరించుచు – ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు#2# అనుదినంబు శక్తిని బొందుచున్న వారమై #2#-యేసుతో ఠీవిగాను వెడలను# యేసుతో# 3. శోధనలు మనల చుట్టివచ్చినా – సాతాను అంబులెన్నితగిలినా #2# భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము #2# -యేసుతో ఠీవిగాను వెడలను# యేసుతో# 4. ఓ యువతి యువకులార చేరుడి – శ్రీయేసు రాజు వార్త చాటుడి #2# లోకమంత యేకమై యేసునాధు గొల్వను #2# సాధనంబెవరు నీవు నేనెగా #యేసుతో#