యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే – ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము -ఆయనే దేవుడు మనకు /యెహోవాను/ 1.యుద్ధ శూరుడెహోవా – నా బలము నా గానము నా పితరుల దేవుడు – ఆయన పేరు యెహోవా /యెహోవాను/ 2.ఫరో రథముల సేనలను – తన శ్రేష్టాధి పతులను ఎర్ర సముద్రములోన – ముంచి వేసెనేహోవా /యెహోవాను/ 3.నీ మహిమాతిశయమున – కోపాగ్ని రగులజేసి చెత్తవలె దహించెదవు – నీపై లేచు వారిని /యెహోవాను/ 4.దోపుడు సొమ్ము పంచుకొని – ఆశ తీర్చుకొందును నా కత్తి దూసెదను – అని శత్రువనుకొనెన్ /యెహోవాను/ 5.వేల్పులలో నీ సముడెవరు – పరిశుద్ధ మహనీయుడా అద్భుతమైన పూజ్యుడా – నీవంటి వాడెవడు /యెహోవాను/ 6.ఇశ్రాయేలీయులంతా – ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను – ఆరిన నేలను నడచిరి /యెహోవాను/