Yevarikosamo Ee pranatyagamu telugu worship song lyrics ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము – ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము నీ కోసమే నా కోసమే కలువరి పయనం – ఈ కలువరి పయనం /2 /ఎవరి/ 1.ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా /2/ మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో నడువలేని నడకలతో తడబడుతూ పోయావా సోలి వాలి పోయావా…. /ఎవరి/ 2.జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము /2/ మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు – వీరిని క్షమించు..వీరిని క్షమించు.. అని వేడుకొన్నావా… పరమ తండ్రిని /ఎవరి/ Credentials: Sung by : Dr.S.P.Balasubrahmanyam