Lechinadura Samadhi Gelchinaadura song Lyrics లేచినాడురా సమాధి గెలిచినాడురా – యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా అ.ప. లేతునని తా జెప్పినట్టు – లేఖనములలో పలికినట్టు /లేచి/ 1. భద్రముగ సమాధిపైని – పెద్దరాతిని యుంచిరి భటులు ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న 2. ప్రభువు దూత పరమునుండి – త్వరగా దిగి రాతిని పొర్లించి భళిర దానిపై కూర్చుండె – భయమునొంద కావలివారు 3. పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు శ్రద్ధతోడ తెచ్చి యేసుకు – రుద్దుదామని వచ్చి చూడ 4. చూడవెళ్లిన స్త్రీలను దూత – చూచి యపుడే వారితోడ లేడు గలలియ ముందుగ పోతున్నాడు – అపుడె లేచినాడని 5. చచ్చిపోయి లేచినాడు – స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినను నను లేపుతాడు – చావు అంటే భయపడరాదు 6. నేను చేసే పనులనెరుగు – నేను నడిచే మార్గమెరుగు నేను చేప్పు మాటలెరుగు – నేను బ్రతికే బ్రతుకు నెరుగు 7. నేను లేచిన యేసునందు – మానక మది నమ్ముకొందు – తాను నాలోయుండినందున – దయను జేర్చు మోక్షమందు 8. పాపభారము లేదు మనకు – మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు – మరువకండి యేసు ప్రభుని 9. యేసు నందే రక్షణ భాగ్యం – యేసు నందే నిత్య జీవం యేసు నందే ఆత్మ శాంతి – యేసు నందే మోక్ష భాగ్యం 10. పాపులకై వచ్చినాడు – పాపులను కరుణించాడు పాపులను ప్రేమించానాడు – ప్రాణదానము చేసినాడు Lyrics from : Song number 687 Andhra kraistava keerthanalu (Supplementary )