Kreesthe Sarwaadhikaari song chords

Click here for this song Lyrics

C                                     F

క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి  

F            G          F      G        C

క్రీస్తే మహోపకారి  – క్రీస్తే ఆ సిల్వధారి   క్రీస్తే సర్వాధికారి… 

   C                                        F

1. ముక్తి విధాతనేత -శక్తి నొసంగుదాత 

F            G            F        G        C

భక్తి విలాపశ్రోత – పరమంబు వీడెగాన…  

2. దివ్య పధంబురోసి – దైవంబు తోడుబాసి 

దాసుని రూపుదాల్చి – ధరణి కేతెంచెగాన

3. శాశ్వత లోకవాసి – సత్యామృతంపురాశి 

శాప భారంబు మోసి – శ్రమల సహించెగాన 

4. సైతాను జనము గూల్పన్ – పాతాళమునకు బంపన్ 

నీతి పధంబు బెంప – రుధిరంబు గార్చెగాన 

5. మృత్యువు ముల్లు త్రుంపన్ – నిత్యజీవంబు బెంపన్  

మర్త్యాళిభయము దీర్పన్ – మరణంబు గెలిచెగాన 

6. పరమందు దివిజులైన – ధరయందు మనుజులైన 

ప్రతినాలుక మోకాలు – ప్రభునే భజించుగాన 

7. ఈ నామమునకు మించు – నామంబు లేదటంచు 

యెహొవా తండ్రి యేసున్ – హెచ్చించినాడుగాన