pellante dehamulu varaina / Daivame thana chitthamuga song lyrics దైవమె తన చిత్తముగా – చేసెనే ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా – విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా – ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా – తండ్రి స్థానంలో భర్తనుగా… నాదనే స్వార్ధము విడగా – మనదనే బంధము జతగా ప్రతిదినం తీగలో లతగా – అల్లుకుపోయే చందముగా … ఆ… పెళ్లంటే దేహములు వేరైనా – ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పం పెళ్లంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే – గొప్ప అవకాశం ఇహలోకాలలో శూన్యం ఉండగా – దైవం తలచినా బంధం పెళ్లిగా మారెనుగా ! /పెళ్లంటే/ 1. రెండుకళ్ళ వేరువేరు – శిరమునందు వేరుపారు దృశ్యమేది చూపిస్తున్నా – చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు – ఒక్క పధము నందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న – గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై – ఏక దేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే – మనువు కొరక దేవతనయులను పెంచాలని – దైవం నియమించెనుగా ఆదిబంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా! /పెళ్లంటే/ 2.వరుని కొరకు వధువు సంఘము – సిద్ధపరచబడితే అందము ఏకదేహమంటే అర్ధము – క్రీస్తుతో సంఘము అనుబంధము లోబడుటయే వధువుకు ఘనము – వరుని ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము ముడతలు లేని – పవిత్రమైన ప్రభువు శరీరము తనకుతానుగా వదువుకోసమే – సమస్తమును అర్పించిన ప్రియ వరుడే ప్రాణప్రియుడు మోసగించక మాటదాటక – వరుని అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వరి ఆ వధువు గొప్పదైన ఆ.. పెళ్ళిమర్మము.. – క్రీస్తు వదువుకే సాదృశ్యము.. ఛాయారూపము! /పెళ్లంటే/ Lyrics in English: Daivame tana Chittamuga – Chesene ghanamainadiga Mudipade dhrudamainadiga – Vidipade veelulenidiga Kalalake sakaaramuga – Okarikokaru adhaaramuga Talli sthaanamlo bhaaryanuga – Tandri sthaanamlo bharthanuga Naadane swaardhamu vidaga – Manadane bandhamu jataga Pratidinam teegalo lataga – Allukupye chandamuga.. aa… Pellante dehamulu Veraina – Okkatiga phaliyinche daiva sankalpam Pellante iruvuru yekamuga – Tandri pani jariginche goppa avakaasham Ihalokaalalo shunyam vundaga – Daivam talachinaa bandham pellagra maarenuga! / Pellante/ 1. Rendu kallu veru veru – Siramunandu Verupaaru Drusyamedi chupistunna – Chupulu rendu jatagaa cheru Rendu kaallu veru veru – Okka padhamunandu cheru Adugu mundu venukavtunna – Gamyam maatram kalise cheru Iruvurokkatai – Yeka dehamai Daiva kutumbamu kaavaalani taane jata prarichenuga Deha sukhamuke – Manuvu koraka Devatanayulanu penchaalani – Daivam niyaminchenuga Aadibandhame Aalumagalugaa Anni bandhamulanu kalipe mulamai maarenuga! /Pellante/ 2. Varuni koraku vadhuvu sanghamu – siddhaparachabadite andamu Yekadehamante ardhamu – Kreestuto sanghamu anubandhamu Lobadutaye vadhuvuku ghanamu – varuni prema vadhuvu swaasthyamu Kalankamu mudatalu leni – Pavitramaina Prabhuvu shareeramu Tanaku taanugaa vadhuvukosame – samastamunu arpinchina priyavarude praanapriyudu Mosaginchaka maatadaataka – Varuni adugujaadalo nadiche praaneswari aa vadhuvu Goppadaina aa.. Pelli marmamu… – Kreestu vadhuvuke saadrusyamu.. Chaayaaroopamu! / Pellante/ Credentials : Song Name: Daivame thana chitthamuga chesega ganamainadhiga Song Album: Mulloka Mahayodhudu Lyricist & Tune, Producer: S.Vijayprasad Reddy Music: Jonah Samuel , Narsapuram Vocals: Karthik & Saindhavi Watch this song on below YouTube link: