Mahimonnatudu Mahimaanvitudu song Lyrics

మహిమోన్నతుడు మహిమాన్వితుడు – మరణము గెల్చిన మృత్యుంజయుడు 

అద్వితీయుడు అతి సుందరుడు – అధిక జ్ఞాన సంపన్నుడు 

ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన 

హల్లెలుయ హల్లెలుయ రాజులరాజుకే హల్లెలుయ #మహి#

 

1. సర్వము నెరిగిన సర్వాధికారి – సర్వము చేసిన సర్వోపకారి #2#

నీతిమంతుని ప్రేమించువాడు – ఇశ్రాయేలును కాపాడువాడు #2#ఆరా#

 

2. నిత్యము వసియించు అమరుడు ఆయనె – మార్గము సత్యము జీవము ఆయనె 

నమ్మిన వారిని రక్షించువాడు – నిత్య జీవము దయచేయువాడు #2#ఆరా#

Credentials:

Lyrics and Tune: Dr.John Wesley

Sung by : Paul Emmanuel

Watch this song below: