ప||నా జీవిత వ్యధలందు -యేసే జవాబు యేసే జవాబు -ప్రభు యేసే జవాబు 1.తీరని మమతలతో -ఆరని మంటలతో ఆశ నిరాశలతో-తూలెను నా బ్రతుకే అ ప ||నను గని వచ్చెను -తన కృప నిచ్చెను కరుణతో ప్రేమించి -కలుషము బాపెను 2. చీకటి వీధులలో -నీటుగా నడచితిని లోకపుటుచ్చులలో -శోకము జూచితిని || అ ప|| ౩. ద్రో హుల నమ్ముకుని -స్నేహము చేసితిని ఇడుముల పాల్జేసి -ఎడ బాసిరి నన్ను|| అ ప|| 4. హంగుల వేషముతో -రంగుల వలయములో నింగికి నేనెగిరి -నేలను రాలితినే || అ ప||