Nee vaakyame nannu bratikinchenu

నీ వాక్యమే నన్ను బ్రతికించెను – బాధలలో నెమ్మది నిచ్చెను (2)

కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా – వాక్యమై యున్న యేసు వందనమయ్యా

1. పాలవంటిది జూ౦టి తేనె వంటిది – నా జిహ్వకు మహా మధురమైనది

మేలిమి బంగారుకన్న మిన్న యైనది – రత్న రాసులకన్నా కోరదగినది

 2. జిగటగల ఊబినుండి లెవనెత్తెను – సమతలమగు భూమిపై నన్ను నిలిపెను

నా పాదములకు దీపమాయెను – నిత్యమైన మార్గములో నన్ను నడిపించును

3. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై – యుద్దమునకు సిద్దమనసు నిచ్చుచున్నది

అపవాది వేయుచున్న అగ్నిబాణములను – ఖడ్గమువలే అడ్డుకొని ఆర్పివేయుచున్నది