Preme saswatamaina song Lyrics

Lyrics in TeluguLyrics in English

ప్రేమే శాశ్వతమైన – పరిశుద్ధమైన పొదరిల్లు!

(హో….. ప్రేమే శాశ్వతమైన – పరిశుద్ధమైన పొదరిల్లు!

మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే

నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే

నిరంతరం నీ మాటలతో ప్రకాశింపచేయుదువు //ప్రేమే//

1 అమరమైన నీ చరితం – విమలమైన నీ రుధిరం

ఆత్మీయముగా ఉత్తేజపరిచిన – పరివర్తన క్షేత్రము //2//

ఇన్నాళ్లుగ నను స్నేహించి ఇంతగ ఫలింపజేసితివీ

ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను….

ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా…. నీ నీడ లేకుండా //ప్రేమే//

2 కమ్మనైన నీ ఉపదేశము – విజయమిచ్చె శోధనలో

ఖడ్గముకంటే బలమైన – వాక్యము ధైర్యమిచ్చె నా శ్రమలో //2//

కరువు సీమలో సిరులొలికించెను -నీ వాక్యప్రవాహము

గగనము చీల్చిమాపైన – దీవెన వర్షము కురిపించితివీ..

ఘనమైన నీ కార్యక్రములు వివరింప నా తరమా – వర్ణంప నా తరమా //ప్రేమే//

3 విధిరాసిన విషాదగీతం – సమసిపోయె నీ దయతో

సంభరమైన వాగ్దానములతో – నాట్యముగా మార్చితివీ //2//

మమతల వంతెన దాటించి – మహిమలో స్థానమునిచ్చితివీ

నీ రాజ్యములో జేష్టులతో – యుగాయుగములు నే ప్రకాశించనా

నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా…. //ప్రేమే//

​Lyrics in English:

Preme saswatamaina – Parishuddhamaina podarillu!

(Ho.. Preme saswatamaina – Parishuddhamaina podarillu!)​

​Manase mandiramaaye naa madilo deepamu neeve

Ninnaasrayinchina vaarini vudayinchu sooryunivalene

nirantaram nee maatalato prakaasimpajeyuduvu //Preme//

1.Amaramaina nee charitam – vimalamaina nee rudhiram

Aatmeeyamuga vuttejaparachina – parivartana keshetramu //2//

Innalluga nanu snehinchi – intaga phalimpajesitivi

Ee swarasampada nantatito – abhinayinchi ne paaderanu…

Vundalenu bratukalenu nee todu lekunda.. nee needa lekunda //preme//

2. Kammanaina nee vupadesam – Vijayamichhe sodhanalo

Khadgamukante balamaina – vaakyamu dhairyamichhe naa sramalo //2//

Karuvu seemalo sirulolikinchenu – nee vakya pravaahamu

Gaganamu cheelchi maapaina – deevena varshamu kuripinchitivi..

Ghanamaina nee kaaryamulu vivarimpa naa tarama – varnimpa naa tarama //preme//3.Vidhi raasina vishaada geetam – samasipoye nee dayato

sambaramaina vaagdhaanamulato – naatyamuga maarchitivi //2//

Mamatala vantena daatinchi – Mahimalo sthaanamu nichhitivi

Nee raajyamulo jestulato – Yugayugamulu ne prakasinchana

Naa paina yendukinta gaadhamaina prema neeku, maruvalenu Yesayya.. //Preme//​

Credits
Produced by : Hosanna Ministries
Sung by: Bro John Wesley
Music: Pranam Kamalakar
Song: Preme saswatamaina

Watch this song on below YouTube link: