నీతిగల యెహోవా స్తుతి మీ – యాత్మతో నర్పించుడి – మీ యాత్మతో నర్పించుడి దాతయౌ మన క్రీస్తు నీటిని – దాల్చుకొని సేవించుడి /నీతి/ 1. చదల బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగా = సదమలంబగు దైవనామము – సర్వదా నుతిజేయును /నీతి/ 2. సర్వశక్తుని కార్యముల కీ – సర్వరాష్ట్రము లన్నియు = గర్వములు విడి తలలు వంచుచు నుర్విలో నుతిజేయును /నీతి/ 3. గీత తాండవ వాద్యములచే – బ్రీతి పరచెడు సేవతో = పాతకంబులు పరిహరించెడు – దాతనే సేవించుడి /నీతి/ 4. పరమదూతలు నరులు పుడమిని – మొరలు బెట్టుచు దేవుని = పరమునందున్నట్టి యేసుని – పాదములు సేవింతురు /నీతి/