Ooruko naa praanama song Lyrics
Lyrics in TeluguLyrics in English
పల్లవి:- ఊరుకో నా ప్రాణమా – కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున – నిశ్చింతగా //2//
అనుపల్లవి:- ఎడారి దారిలోన – కన్నీటి లోయలోన //2//
నా పక్షమందు నిలిచి – నా ముందరే నడిచి
నీ శక్తినే చాట – నన్నుంచెనే ఈ చోట
నిన్నెరుగుటే మా ధనం – ఆరాధనే మా ఆయుధం
1. ఎర్రసముద్రాలు – నా ముందు పొర్లుచున్న
ఫరో సైన్యమంతా – నా వెనుక తరుముచున్న//2//
నమ్మదగిన దేవుడే – నడిపించుచుండగా
నడి మధ్యలో నన్ను – విడిచిపెట్టునా//2//
2. ఇంతవరకు నడిపించిన – దాక్షిణ్యపూర్ణుడు
అన్యాయము చేయుట – అసంభవమెగా //2//
వాగ్ధానమిచ్చిన – సర్వశక్తిమంతుడు
దుష్కార్యము చేయుట – అసంభవమెగా//2//
3. అవరోధాలెన్నో – నా చుట్టు అలుముకున్న
అవరోధాల్లోనే – అవకాశాలను దాచెగా //2//
యెహోవా సెలవిచ్చిన – ఒక్కమాటయైనూ
చరిత్రలో ఎన్నటికీ – తప్పియుండలేదుగా//2//
Ooruko napraanama – kalata chendaku
Aanuko prabhu rommuna – nischintaga.. //2//
Chorus: Yedaari daarilona.. Kanneti loyalona //2//
Naa pakshamandu nilachi – Naa mundare nadichi
Nee shakthi ne chaata – nannunchene ee chota
Ninnerugute maa dhanam – Aaraadhane maa aayudham
1.Erra samudraalu – naa mundu porluchunna
Pharo sainyamanta – Naa venuka tarumuchunna //2//
Nammadagina devude – Nadipinchuchudaga
Nadimadhyalo nannu – vidichipettuna //2//
2.Entavaraku nadipinchina – Daakshinyapoornudu
Anyaayamu cheyuta – Asmbhavamega //2//
Vaagdhaanamichhina – sarvasakthimantudu
Dushkaaryamu cheyuta – Asmbhavamega //2//
3.Avarodhaalenno – Naa chuttu alumukunna
Avarodhaallone – Avakaashaalanu daachega //2//
Yehova selavichhina – Okkamaata yeinanu
Charitralo yennatiki – Tappiyundaleduga.. //2//
CREDITS:
Credits: