నిన్ను విడచి నేను జీవించగలనా 

నీకు విరోధముగ జీవింప సాధ్యమా/2/

యేసయ్యా..  యేసయ్యా.. /2/

1. నాలాంటి బలహీనులు ఈ లోకంలో ఎవరు 

నీలాంటి బలవంతులు ఈ లోకంలో లేరు /2/

నీదు కృపయే నన్ను బలపరచెను/2/ 

నీదు ప్రేమయే నను చేరదీసెను/2/యేసయ్యా/

2. పువ్వులతో చేరిన దారం సువాసనయిచ్చును 

నీతో నేను చేరుటవలన సువాసన కలుగును /2/

నీకు సమానులు ఈ లోకంలో ఎవరు /2/

నీకు సాటి ఎవరు లేరయ్యా /2/యేసయ్యా/ 

3. శిరస్సు నుండి శరీరాన్ని వేరుచేయగలమా

నీతో జీవింప ఆశపడు నను వేరుచేయ గలరా /2/   

నన్ను మోసే దేవుడు నీవయ్యా /2/

క్షమించి నడిపే దైవం నీవే యేసయ్యా/2/యేసయ్యా/