పరమ యెరుషలేమా.. పరిషుద్ధ భూషణాలతో – వరునికై అలంకరించి – సిద్ధపడిన వధువు సంఘమా ఆమెన్ హల్లెలుయా – ఆమెన్ హల్లెలుయా /2/ 1. రెక్కల క్రింద -తన పిల్లల చేర్చుకొని ప్రేమతోడ పిలచిన -కోడిని పోలి పిలిచాడు ప్రభు నిన్ను – వెనుదియ్యకు ప్రభు నుండి /2/ 2. నా గొర్రెలు నా స్వరము వింటాయి – అవి ఎన్నడు నను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు యేసు – అనుసరించు ప్రభు యేసుని /2/ 3. తన గర్భాన పుట్టిన బిడ్డను – యే తల్లైన మరచిన మరువవచ్చును ప్రభునిన్ను మరువడు – మరువవద్దు ప్రభు యేసుని /2/ 4. శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో – శోధనలలో విశ్వాసం కాపాడుకో ప్రభువు కొరకు సిద్ధపడుమా – గొర్రెపిల్ల జీవకన్యకా /2/