Aha mahanadame song Lyrics

పల్లవి:  ఆహా మహానందమే – ఇహ పరంబులన్ 

మహావతారుండౌ – మా యేసు జన్మ దినం – హల్లేలూయ  .. ఆహా ..

1. కన్యక గర్భమందు పుట్టగా – ధన్యుడవంచు దూతలందరు  (2X)

మాన్యులౌ పేద గొల్లలెందరో – అన్యులౌతూర్పు జ్ఞానులెందురో  (2X)

నిన్నారాధించిరి -హల్లేలూయ .. ఆహా ..

2.  యెహోవా తనయా – యేసు ప్రభూ,  సహాయుడా – మా స్నేహితుడా  (2X)

ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ – మహానందముతో నిన్నారాధింతుము(2X)

నిన్నారాధింతుము – హల్లేలూయ .. ఆహా ..

3. సర్వేశ్వరున్ రెండవ రాకడన్ – స్వర్గంబు నుండి వచ్చు వేళలో (2X)

సర్వామికా సంఘంబు భక్తితో – సంధించి నిన్ స్తోత్రించువేళలో (2X)

నిన్నారాధింతుము – హల్లేలూయ