Enduko Nannintaga neevu

Click here for this song Chords

ఎందుకో నన్నింతగా నీవు – ప్రేమించితివో దేవా 

అందుకో నా దీన స్తుతిపాత్ర – హల్లెలుయ యేసయ్య //2//

1. నా పాపము బాప నరరూపివైనావు

నా శాపము మాప నలిగి వ్రేలాడితివి 

నాకు చాలిన దేవుడవు నీవే – నా స్తానములో నీవే 

2. నీ రూపము నాలో నిర్మించి యున్నావు 

నీ పోలికలోనే నివసించుమన్నావు 

నీవు నన్ను ఎన్నుకోన్నావు -నీ కొరకై నీ కృపలో 

3. నా శ్రమలు సహించి  – నా ఆశ్రయమైనావు 

నా వ్యధలు భరించి – నన్నాదుకొన్నావు 

నన్ను నీలో చేర్చుకొన్నావు  నను దాచి యున్నావు 

4. నీ సన్నిధి నాలో – నా సర్వము నీలో

నీ సంపద నాలో-  నా సంతసము నీలో

నీవు నేను ఏకమగు వరకు – నను విడువనంటివి దేవా   

5. నా మనవులు ముందే – నీ మనసులో నెరవేరె 

నా మనుగడ ముందే – నీ గ్రంధములో లోనుండె

ఏమి అద్భుత ప్రేమ సంకల్పం – నీకేమి చెల్లింతు 

Lyrics in English:

Enduko Nannintaga neevu – preminchitivo deva…

Anduko naa deena Stutipaatra – Halleluya Yesayya.. //2//

1.Naa paapamu baapa, nara roopivainaavu

Naa shaapamu maapa naligi vrelaaditivi

Naaku chaalina devudavu neeve – Naa sthaanamulo neeve

2.Nee roopamu naalo nirminchi yunnavu

Nee polikalone nivasinchamannavu

Neevu nannu ennukonnaavu – Neekorakai nee krupalo

3.Naa sramalu sahinchi naakaasrayamainaavu

Naa vyadhalu bharinchi nannadukonaavu

Nannu neelo cherchukonnavu – Nanu daachiyunnaavu

4.Nee sannidhi naalo, naa sarvamu neelo

Nee sampada naalo, naa santasamu neelo

Neevu nenu yekamaguvaraku – Nanu viduvanantivi deva

5.Naa manavulu munde nee manasulo neravere

Naa manugada munde nee grandhamulonunde..

Emi adbhuta prema sankalpam – neekemi chellintu