Gorrepilla Vivaahotsava  Telugu marriage song lyrics

Lyrics in Telugu:

గొర్రెపిల్ల వివాహోత్సవ
సమయము వచ్చెను రండి (2)

1.సర్వాధికారియు సర్వోన్నతుండైన (2)
మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) //గొర్రె//

2.సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2)
నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) //గొర్రె//

3.పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2)
గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) //గొర్రె//

4.తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2)
నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) //గొర్రె//

5.దేవుని వాక్యమను నామము గలవాడు (2)
రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె (2) //గొర్రె//

6.ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు (2)
పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ (2) //గొర్రె/

7.శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు (2)
వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె (2) //గొర్రె//

Lyrics in English

Gorrepilla Vivaahotsava
Samayamu Vachchenu Randi (2)

  1. Sarvaadhikaariyu Sarvonnathundaina (2) Mana Thandrini Ghanaparachi Manamutsahinchedamu (2) //Gorre//

  2. Sidhdhapadenu Vadhuvu Suprakaashamu Gala (2)
 Nirmala Vasthramulatho Nalankarinchukonen (2) //Gorre//

  3. Parishudhdhula Neethi Kriyale Yaa Vasthramulu (2)
Gorre Pilla Rakthamulo Shudhdhi Nondina Vaaru (2) //Gorre//

  4. Thellani Gurramupai Koorchundinavaadu (2)
Nammakamai Yunnatti Pendli Kumaarundu (2) //Gorre//

  5. Devuni Vaakyamanu Naamamu Galavaadu (2)
Rakthamulo Munchina Vasthramun Dhariyinche (2) //Gorre//

  6. Preminchi Sanghamukai Praanambu Nide Prabhuvu (2)
Parishudhdha Parachuta Korakai Thaanappaginchukonen (2) //Gorre//

  7. Sree Yesu Kreesthunde Sanghambunaku Shirassu (2)
Vaakya Udakamu Thoda Shudhdhi Parachuchunde (2) //Gorre//

Credentials: Album: Parinaya Swaraalu,
Singer: Jikki; Lyrics,
Composition: Dr. A. R. Stevenson