Hey Prabhu yesu Telugu Song Lyrics

హే ప్రభుయేసు హే ప్రభుయేసు – హే ప్రభుయేసు దేవ సుతా

సిల్వధరా- పాపహర- శాంతికరా

  1. శాంతి సమాధానాధిపతి- స్వాంతములో ప్రశాంత నిధి (2)

శాంతి స్వరూపా జీవనదీపా (2)- శాంతి సువార్త నిధి #హే#

  1. తపములు తరచిన నిన్నే గదా – జపములు గొలచిన నిన్నేగదా(2)

విఫలులు చేసిన విజ్ఞా పనలకు(2)- సఫలత నీవె కదా#హే#

  1. మతములు వెదకిన నిన్నెకద – వ్రతములు గోరిన నిన్నే గదా(2)

పతితులు దేవుని సుతులని నేర్పిన(2)- హితమత నీవె గదా#హే#

  1. పలుకులలో నీ శాంతి కధ – తొలకరి వానగ గురిసెగద(2)

మలమల మాడిన మానవ హృదయము(2)- కళకళలాడే కదా#హే#