Kalyaname Vaibhogam Telugu Marriage song lyrics

కళ్యాణమే వైభోగం – కమనీయ కాంతుల దీపం /2/ 

శ్రుతిలయల సుమధుర గీతం /2/

దైవ రచిత సుందర కావ్యం /కళ్యాణమే/

  1. పరమ దైవమె ప్ర్రారంభించిన పరిశుద్ధమైన కార్యం /2/

నరుని మంచికై తన చేతులతో 

ప్రభు రాసిచ్చిన పత్రం /కళ్యాణమే/

  1. కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం

మోడుగానున్న జీవితాలు /2/  

చిగురింపజేసే వసంతం  /కళ్యాణమే/

  1. దేవదూతలే తొంగిచూసేటి దృశ్యం

భావమధురిమలు పొంగజేసేటి /2/ 

కమనీయమైన చిత్రం /కళ్యాణమే/

Lyrics, Music & Singer: Dr. A. R. Stevenson

Album: Kalyaname Vaibhogam

Singer: Dr. A. R. Stevenson