Kreestuni poli suvaarthanu chaataali – song lyrics

క్రీస్తుని పోలి సువార్తను చాటాలి – క్రీస్తునివలె పరిచర్యను చేయాలి (2)

క్రీస్తుని పోలి ప్రార్ధనలో గడపాలి – క్రీస్తునివలె నీతిగా జీవించాలి

ఇదేగా సేవకునికి ప్రమాణము – క్రీస్తులో నాయకుని నిజ ప్రయాణము (2)

1.(ఉన్నతమైన పిలుపులో పౌలువలె సేవ చేయాలి

ఉత్తమమైన సువార్తతో శిష్యులుగా తరలి వెళ్ళాలి) (2)

ఉపద్రవములు ఎన్ని వచ్చినను ఉపవాసముతో జయించాలి (2)

క్రీస్తే మనకు మాదిరి యేసే మనకు ఊపిరి –

క్రీస్తే మనకు కాపరి యేసే మనకు పరిహారి /క్రీస్తుని పోలి/

2.దేవుని స్వరూపమును కలిగి క్రీస్తువలె జీవించాలి

దాసుని స్వరూపము ధరించి క్రీస్తువలె చాటి చెప్పాలి

ఒకరికి ఒకరు తోడుగా నిలిచి దేవుని పనిని ముగించాలి

క్రీస్తే మనకు మార్గము యేసే మనకు సత్యము

క్రీస్తే మనకు జీవము యేసే నిత్య జీవము

3.శాశ్వతమైన నిబంధనతో సిలువను మోయుచు వెళ్ళాలి

భారమైన మనసుతో రక్షణ వార్తను చాటాలి

కనికరముతో అండగ నిలిచి దీనులను ఆదరించాలి

క్రీస్తే మనకు ఆధారం యేసే మనకు ఆనందం

క్రీస్తే మనకు ఉజ్జీవం యేసే మనకు ప్రాణము

Song: Global Telugu Christian Ministries – World Telugu Christian Summit London Theme song
Lyrics and Tune:Bro. Palaparthi Ratna Raju
Music: Bro Geddam Saalman