Krottayedu modalubettenu Song Lyrics

Click here for this song Chords

Lyrics in TeluguLyrics in English

క్రొత్త యేడు మొదలు బెట్టెను – మన బ్రతుకునందు 

క్రొత్తమనసు తోడ మీరు – క్రొత్త యేట ప్రభుని సేవ

తత్తర పడకుండ జేయు – టుత్తమోత్తమంబు జూడ 

1. పొందియున్న మేలులన్నియు బొంకంబు మీర    

డెందమందు స్మరణ జేయుడి – యిందు మీరు మొదలుబెట్టు 

పందెమందు గెల్వవలయు – నందముగను 

రవినిబోలి – నలయకుండ మెలయకుండ 

2. మేలు సేయ దడ వొనర్పగా – మీరెరుగునట్లు – కాలమంత 

నిరుడు గడచెగా – ప్రాలుమాలి యుండకుండ 

జాల మేలు సేయ వలయు – జాల జనముల కిమ్మాను 

యేలు నామ ఘనత కొరకు 

3. బలములేని వారమయ్యును – బలమొందవచ్చు 

గలిమి మీర గర్త వాక్కున – నలయకుండ నడుగుచుండ  

మోదమొంది – బలమొసంగు సర్వ విధుల – నెలమి మీ రొనర్చుచుండ 

4. ఇద్ధరిత్రి నుండునప్పుడే – యీశ్వరుని జనులు వ్రుద్ధిబొంద 

జూడ వలయును – బుద్ధి నీతి శుద్దులందు –   వ్రుద్ధినొంద 

శ్రద్ధ జేయ – శుద్దులైన వారిలో ప్ర – సిద్దు లగుచు వెలుగవచ్చు 

5. పాప పంక మంటి నప్పుడు – ప్రభు క్రీస్తు యేసు – ప్రాపు 

జేరి మీరు వేడగా – నేపు మీర దనదు కరుణ – బాప 

మంత గడిగివేసి – పాప రోగ చిహ్నలన్ని – బాపివేసి శుద్ధి జేయు

Lyrics in English:

Kroththa Yedu Modalu Bettenu Mana Brathuku Nandu

Kroththa Yedu Modalu Bettenu

Kroththa Manasu Thoda Meeru Kroththa Yeta Prabhuni Seva

Thaththara Padakunda Jeyu Tuthamothamambu Jooda //Krotta//

1.Pondiyunna Melulanniyu Bonkambu Meera

Dendamandu Smaran Jeyudi

Indu Meeru Modalupettu Pandemandu Gelva Valayu

Andamuganu Ravini Boli Alayakunda Melayakunda //Krotta//

2.Meluseya dadavonarpaga – Meererugunatlu – Kaalamanta

Nirudu gadachega – Praalumaali yundakunda

Jaalamelu seyavalayu – Jaala janamulakimmaanu

Yelunaama ghanatakoraku

3.Balamu Leni Vaaramayyunu Balamondavachchu

Kalimi Meera Gartha Vaakkuna

Alayakunda Aduguchunda Nalagakunda Modamondi

Balamosangu Sarva Vidhula Nelami Meera Nochchuchunda //Krotta//

4.Iddaritri nundunappude – Eeshwaruni janulu vruddibonda

Joodavalayunu – Buddhineeti shuddhulandu – Vruddhinonda

Sraddhajeya – Shuddhulaina vaarilo prasiddhulaguchu velugavachhu

5.Paapa Pankamantinappudu Prabhu Kreesthu Yesu

Praapu Jeri Meeru Vedagaa

Sepu Meera Thanadu Karuna Paapamantha Kadigivesi

Paapa Roga Chihnalanni Baapi Vesi Shudhdhi Cheyu //Krotta//