పల్లవి: మహోదయం శుభోదయం సర్వలోకాని కరుణోదయం

శ్రీయేసు రాజు జన్మ దినం భూప్రజలెల్లరి హృదయానందం 

1. సర్వలోకాన సువార్త తెల్ప భువికేతించిన మరియ పుత్రుడు 

క్రుపామయుడు సత్య సంపూర్ణుడు క్రీస్తేసు రాజు జన్మ దినం 

ఆ హల్లేలుయా ఆహల్లేలుయా ఆహల్లేలుయా ఆహల్లేలుయా (2x)

2. ఘోర పాపములోనున్న జనులకు పరలోక జీవ మార్గము చూప

కరుణామయుడు ఇమ్మానుయేలు అవతరించిన శుభోదయం

ఆ హల్లేలుయా ఆహల్లేలుయా ఆహల్లేలుయా ఆహల్లేలుయా (2x)