మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట

నా జీవిత ధన్యతై యున్నది (2)

1. మొడుబారిన జీవితాలను – చిగురింపచేయగలవు నీవు(2)

మారా అనుభవం మధురముగా (2)- మార్చగలవు నీవు||మహో||

2. ఆకు వాడక ఆత్మ ఫలములు – ఆనందముతో ఫలియించనా(2)

జీవ జలముల ఊటయైన (2)- నీ యోరన నను నాటితివా ||మహో||

3. వాడాబారని స్వాస్త్యము నాకై – పరమందు దాచి యుంచితివా(2)

వాగ్ధాన ఫలము అనుభవింప (2)- నీ కృపతో నన్ను పిలచీతివా ||మహో||