మంచి దేవుడు నా యేసయ్య – చింతలన్ని బాపునయా 

హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము నిచ్చునయా #2#

మహిమ…  ఘనత…  ప్రభావము..  నీకే..  #2#

1. క్పపల వెంట కృపను చూపి – విడువక నీ కృపలను చూపిన #2#

కృపగల నా యేసు రాజ – నీ కృప నాకు చాలునయా #2#మహిమ#

2. మహిమ వెంట మహిమ నొసగి – నీ రూపమున నన్ను మార్చి #2#

మహిమలో నీవుండు చోటికి – మమ్ము ప్రేమతో పిలచితివి #2#మహిమ#

3. జయము వెంట జయము నిచ్చి – జయ జీవితము మాకుఇచ్చి #2#

జయశీలుడు నా యేసు ప్రభువని – జయము జయమని పాడెదను#2 #మహిమ#