మోసితివ నా కొరకై – సిలువ వేదనను 

గొల్గొతా నీవు – క్రీస్తుకై – విలచితి వేదనలో 

సిలువలో రక్తము – పాపికి రక్షణ – విలువగు మోక్షమును  

పాప క్షమాపణ  – పాపికి ముక్తి – పరమ ప్రభుని గనుము /మోసితివ/

1.  అమ్మా ఇదిగో నిసుతుడు – వేలాడుచు పిలిచేన్ 

ఏలి ఏలి లామ – సబక్తని  చేవిడితి 

దాహము తీర్చగ చేదు – చిరకను అందించిరిగ 

ముండ్ల మకుట నీ శిరముపై – గ్రుచ్చిరి యూదుల రాజని 

హేళన చేసిరి – గ్రుద్దిరి ఉమిసిరి కొరడా – దెబ్బలతో 

దేవ నా దేవా – ఏలనా చేయి విడనాడితి-విలలో /మోసితివ/ 

2. తరతరాల యీలోకం – యుగయుగాల నీ నామం 

తరగని వేదన నీకు – సిలువ విజయమునకే 

కల్వరిధారా నాధా – పాపికి ప్రాణ ప్రదా..త 

విలువగు రక్త ప్రధాత – ఆశ్రిత రక్షణ రా..జా 

చిందిన రక్తము – విలువగు ప్రాణము – లోక విమోచనకే 

అందదు ఊహకు – అంతము ఎప్పుడో – సిద్ధపరచు – ప్రభువా /మోసితివ/